బదిలీలకు సై

-ఉద్యోగుల బదిలీ ప్రక్రియకు సీఎం కేసీఆర్ ఆమోదం -మార్గదర్శకాలతో ఉత్తర్వులు జారీ.. నేటి నుంచి జూన్ 15 వరకు బదిలీలు -రెండేండ్ల సర్వీసు పూర్తిచేస్తేనే అర్హత.. ఐదేండ్లు దాటితే తప్పనిసరిగా బదిలీ -ఆర్డర్ టు సర్వ్ ఉద్యోగులకు కోరుకొన్నచోటికి బదిలీ -భార్యాభర్తల్లో ఒకరికి అవకాశం.. దివ్యాంగులు, ఒంటరి మహిళలు,మారుమూల ప్రాంత ఉద్యోగులకు ప్రాధాన్యం -అందుబాటులో ఉన్న చోట ఆన్‌లైన్‌లోనే కౌన్సెలింగ్ -ఏ ప్రభుత్వ విభాగంలోనూ 40 శాతం మించి బదిలీలు చేయరాదు. -ఒకే ప్రదేశానికి ఎక్కువమంది బదిలీని కోరుకొంటే లాటరీ ద్వారా ఎంపికచేస్తారు. -మానసిక వైకల్యం కలిగిన పిల్లలున్న తల్లిదండ్రులకు, ఒంటరి మహిళలు, వితంతువులకు బదిలీల్లో మొదటి ప్రాధాన్యం ఇస్తారు. -జూన్ 16 నుంచి బదిలీలపై తిరిగి నిషేధం. ఉద్యోగుల సాధారణ బదిలీలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆమోదం తెలిపారు. అజయ్‌మిశ్రా కమిటీ ఇచ్చిన మార్గదర్శకాలకు సవరణలను సూచించి, ఆ మేరకు జీవోలను జారీచేయాలని ఆదేశించారు. శుక్రవారం నుంచి బదిలీలను ప్రారంభించాలని స్పష్టంచేశారు. రాష్ట్రప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి సారథ్యంలో, సీనియర్ ఐఏఎస్‌లు అధర్‌సిన్హా, శివశంకర్‌ల కమిటీ అందజేసిన మార్గదర్శకాలపైన సీఎం గురువారం ఉద్యోగసంఘాల జేఏసీతో చర్చించారు. అప్పటికప్పుడే నిర్ణయాలను ప్రకటించారు. శాఖలవారీగా మార్గదర్శకాలను ఇవ్వాలని నిర్ణయించారు. పదోన్నతుల ప్రక్రియను కూడా వెంటనే మొదలుపెట్టాలని, అర్హతలు ఉన్న సీనియర్ అధికారులకు పదోన్నతులు ఇచ్చి బదిలీలను చేపట్టాలని చెప్పారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు బదిలీలు, పదోన్నతులకు సంబంధించిన మార్గదర్శకాలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి జీవోను విడుదలచేశారు. బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్టు ఉత్తర్వుల్లో స్పష్టంచేశారు. మే 25 నుంచి జూన్ 15 వరకు బదిలీలు జరుగుతాయని, జూన్ 16 నుంచి మళ్లీ నిషేధం అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. ఈ ఉత్తర్వుల ప్రకారం పదోన్నతులను, బదిలీలను సమాంతరంగా నిర్వహిస్తారు. ప్రతిశాఖలో 40 శాతం మించకుండా బదిలీలు జరుగుతాయి. రెండువేలకు పైగా ఉద్యోగులకు పదోన్నతులు లభిస్తాయి.

Latest News

 • దేశం గర్వించేలా తెలంగాణ తేజస్సు

  దేశం గర్వించేలా తెలంగాణ తేజస్సు

  - నాలుగేళ్లుగా ఆదాయవృద్ధిలో అగ్రస్థానం - ప్రధానే మెచ్చుకున్నారు - బంగారు తెలంగాణకు పునరంకితం - విజయయాత్రకు అండగా నిలవాలి - కుట్రలన్నీ తుత్తునియలు - సుస్థిరత, రాజకీయ అవినీతి లేని పాలన - కేంద్రం ఆమోదించగానే కొత్త జోనల్‌ ని...

   On 16 Aug, 2018 11:00 AM Read More

 • విభజన హామీలు అమలుచేయాలి

  విభజన హామీలు అమలుచేయాలి

  - కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వాలి - లేనిపక్షంలో 20వేల కోట్ల ప్యాకేజీ ఇవ్వాలి - తమిళనాడు తరహాలో తెలంగాణకు రిజర్వేషన్లు -బీసీల సంక్షేమానికి కేంద్రంలో ప్రత్యేక శాఖ - టీఆర్‌ఎస్ కార్యవర్గం తీర్మానాలు - మీడియాకు వివరించిన పార్ట...

  Namasthe Telangana  On 14 Aug, 2018 10:45 AM Read More

 • ఆగస్టు 15 మూడు కానుకలు

  ఆగస్టు 15 మూడు కానుకలు

  - రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ కొత్త పథకాలు - పేదలకు కంటి చూపు.. రైతులకు బీమా సౌకర్యం.. -బీసీలకు సబ్సిడీ రుణాలు - ప్రజలకు అందనున్న మిషన్ భగీరథ ఫలాలు - స్వచ్ఛ గ్రామాలకు ఆగస్టు 15 నుంచే శ్రీకారం స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్క...

  Namasthe Telangana  On 13 Aug, 2018 10:37 AM Read More

 • కరుణానిధికి సీఎం కేసీఆర్ నివాళి

  కరుణానిధికి సీఎం కేసీఆర్ నివాళి

  - కుటుంబ సభ్యులకు పరామర్శ - కేసీఆర్ వెంట ఎంపీ కవిత, విప్ పల్లా - ప్రజల సందర్శనార్థం రాజాజీ హాల్లో భౌతికకాయం - కరుణ కడపటి చూపు కోసం జనం బారులు - నివాళులర్పించిన ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ - వివిధ రాష్ర్టాల సీఎంలు, నేతలు, సినీ ప్ర...

  Namasthe Telangana  On 9 Aug, 2018 11:31 AM Read More

 • హరిత సైన్యం

  హరిత సైన్యం

  - పచ్చదనం పెంపునకు పోలీసుశాఖ సాయంతో ఏర్పాటు - మొక్కల పెంపకంలో రాజీ లేదు - సిబ్బందితోపాటు నిధులు కేటాయిస్తాం - సమష్టి కృషితోనే హరిత లక్ష్యాల సాధన - హరితహారంలో సీఎం కేసీఆర్‌ ప్రకటన - ఒకేరోజు 1.25 లక్షల మొక్కలు నాటిన గజ్వేల్‌ ...

   On 2 Aug, 2018 6:14 PM Read More