మురుస్తున్న పల్లెలు

-గ్రామాల అభివృద్ధికి కనీవినీ ఎరుగని రీతిలో నిధులు -నాలుగేండ్లలో రూ.73వేల కోట్ల ఖర్చు.. గ్రామజ్యోతితో మరో రూ.25 వేల కోట్లు -కొత్త పంచాయతీల్లో రోడ్ల కోసం రూ.5000 కోట్లు -కొత్త పంచాయతీరాజ్ చట్టంతో పల్లెల్లో నూతన శోభ కనిపించని కుట్రల వెనుక పల్లె కన్నీరు పెడుతున్నదంటూ నాలుగేండ్ల కిందటిదాకా గోరటి ఎంకన్న రాసిన పాటను ఊరూరా పాడుకొన్నం. నీళ్లులేక.. పొలాలను పడావు పెట్టి పట్నంమొకం పట్టి పోయెటోళ్లతో ఎర్రబస్సులు నిండిపోయేటివి. రోడ్లుండవు.. నీళ్లు రావు.. కరంటు ఉండదు.. ఓట్ల పండుగొస్తె మాత్రం కాంగ్రెసోళ్లు.. తెలుగుదేశపోళ్ల కార్లు పొలోమని దుమ్మురేపుకొంటూ వచ్చేటివి. మాయమాటలు చెప్పి ఓట్లేయించుకొని ఐదేండ్లపాటు అడ్రస్ లేకుండా పోయెటోళ్లు.. ఏ పని గురించి ఎవరినైనా అడగాలంటే.. ఆఫీసు ఆమడదూరం.. అధికారులు మరింత దూరం.. అమాత్యులు అల్లంతదూరం అన్నట్టుండేది.. నాలుగేండ్లయింది.. తెలంగాణ వచ్చినంక ఇవాళ ఒక్కసారి పల్లెల్లోకి పోతే.. ఇవి అప్పటి పల్లెలేనా అనిపిస్తున్నది. 50 ఏండ్లలో జరుగని అభివృద్ధి నాలుగేండ్లలో కండ్లముందు కనిపిస్తున్నది.పల్లెలకు ఇవాళ రాజయోగం పట్టింది. ఏండ్లతరబడి నిరాదరణకు గురైన గ్రామాలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయి. దశాబ్దాలుగా తండాలుగా, గూడేలుగా ఉన్న ప్రాంతాలు ఇవాళ గ్రామశోభను సంతరించుకొన్నాయి. ఎండకాలం వచ్చిందంటే రోడ్లకు అడ్డంగా ఖాళీబిందెలతో నీళ్ల కోసం ఆందోళనలకు దిగేరోజులు పోయాయి. సమస్యలను పరిష్కరించాలని నిలదేసే పరిస్థితులు ఎక్కడా కనిపించడంలేదు. ఎరువులు.. విత్తనాలకోసం చెప్పుల క్యూల మాటే లేదు. చెరువులు నిండుగా కనిపిస్తున్నాయి. వాగు మత్తడి దుంకితే రాకపోకలు బంద్ అవుతాయన్న దిగులు లేదు. ఇప్పుడు అవసరమున్న చోటల్లా వంతెనలు నిర్మాణమయ్యాయి.

Latest News

 • దేశం గర్వించేలా తెలంగాణ తేజస్సు

  దేశం గర్వించేలా తెలంగాణ తేజస్సు

  - నాలుగేళ్లుగా ఆదాయవృద్ధిలో అగ్రస్థానం - ప్రధానే మెచ్చుకున్నారు - బంగారు తెలంగాణకు పునరంకితం - విజయయాత్రకు అండగా నిలవాలి - కుట్రలన్నీ తుత్తునియలు - సుస్థిరత, రాజకీయ అవినీతి లేని పాలన - కేంద్రం ఆమోదించగానే కొత్త జోనల్‌ ని...

   On 16 Aug, 2018 11:00 AM Read More

 • విభజన హామీలు అమలుచేయాలి

  విభజన హామీలు అమలుచేయాలి

  - కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వాలి - లేనిపక్షంలో 20వేల కోట్ల ప్యాకేజీ ఇవ్వాలి - తమిళనాడు తరహాలో తెలంగాణకు రిజర్వేషన్లు -బీసీల సంక్షేమానికి కేంద్రంలో ప్రత్యేక శాఖ - టీఆర్‌ఎస్ కార్యవర్గం తీర్మానాలు - మీడియాకు వివరించిన పార్ట...

  Namasthe Telangana  On 14 Aug, 2018 10:45 AM Read More

 • ఆగస్టు 15 మూడు కానుకలు

  ఆగస్టు 15 మూడు కానుకలు

  - రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ కొత్త పథకాలు - పేదలకు కంటి చూపు.. రైతులకు బీమా సౌకర్యం.. -బీసీలకు సబ్సిడీ రుణాలు - ప్రజలకు అందనున్న మిషన్ భగీరథ ఫలాలు - స్వచ్ఛ గ్రామాలకు ఆగస్టు 15 నుంచే శ్రీకారం స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్క...

  Namasthe Telangana  On 13 Aug, 2018 10:37 AM Read More

 • కరుణానిధికి సీఎం కేసీఆర్ నివాళి

  కరుణానిధికి సీఎం కేసీఆర్ నివాళి

  - కుటుంబ సభ్యులకు పరామర్శ - కేసీఆర్ వెంట ఎంపీ కవిత, విప్ పల్లా - ప్రజల సందర్శనార్థం రాజాజీ హాల్లో భౌతికకాయం - కరుణ కడపటి చూపు కోసం జనం బారులు - నివాళులర్పించిన ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ - వివిధ రాష్ర్టాల సీఎంలు, నేతలు, సినీ ప్ర...

  Namasthe Telangana  On 9 Aug, 2018 11:31 AM Read More

 • హరిత సైన్యం

  హరిత సైన్యం

  - పచ్చదనం పెంపునకు పోలీసుశాఖ సాయంతో ఏర్పాటు - మొక్కల పెంపకంలో రాజీ లేదు - సిబ్బందితోపాటు నిధులు కేటాయిస్తాం - సమష్టి కృషితోనే హరిత లక్ష్యాల సాధన - హరితహారంలో సీఎం కేసీఆర్‌ ప్రకటన - ఒకేరోజు 1.25 లక్షల మొక్కలు నాటిన గజ్వేల్‌ ...

   On 2 Aug, 2018 6:14 PM Read More