చరిత్రాత్మక రైతుబీమా

-నా జీవితంలో చేసిన అతి గొప్పపని ఇదే -అన్నదాతకు బీమా కల్పించిన తొలిరాష్ట్రం మనదే: సీఎం కేసీఆర్ -ఆగస్టు 15 నుంచి రైతులకు సర్కారు భరోసా -రైతులకోసం ఎంత ఖర్చయినా వెనుకాడబోం -రైతుబంధు పెట్టుబడిసాయం నేను తీసుకోలేదు.. -కానీ.. బీమా పథకంలో తప్పకుండా చేరుతాను -రాష్ట్రంలోని రైతులందరూ తప్పకుండా చేరాలి -భవిష్యత్తులో యాంత్రీకరణ ద్వారానే వ్యవసాయం -రైతులందరికీ సబ్సిడీపై యంత్రాల సరఫరా -తెలివైన రైతులు తెలంగాణలో ఉన్నారనిపించుకోవాలి -రైతుబంధు బీమా అవగాహన సదస్సులో సీఎం కేసీఆర్ -రైతుబంధు అమలుతో కొన్ని పార్టీలు దివాళాతీశాయని వ్యాఖ్య -ఎల్‌ఐసీతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంవోయూ నా జీవితంలో చేసిన అతి గొప్పపని రైతులందరికీ రైతుబంధు జీవితబీమా పథకం కల్పించడమే అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు. రాష్ట్రంలో 57 లక్షల మంది పట్టాదారు రైతులున్నారని, ఏదైనా ప్రమాదంలో లేదా సహజంగా చనిపోయినా వర్తించేలా 18 నుంచి 60 ఏండ్లలోపు వయసున్న రైతులందరికీ ఆగస్టు 15 నుంచి రైతుబీమా ప్రారంభమవుతుందని తెలిపారు. రైతుల కోసం ఎంత ఖర్చయినా వెనుకాడబోమని నొక్కిచెప్పారు. వ్యక్తిగతంగా రైతుబంధు పెట్టుబడిసాయం తాను తీసుకోలేదని, బీమా పథకంలో మాత్రం తప్పకుండా చేరుతానని అన్నారు. రైతులందరూ తప్పకుండా చేరాలని పిలుపునిచ్చారు. రైతాంగానికి ప్రతీయేటా రెండుపంటలకు పెట్టుబడి సాయం తప్పకుండా చెల్లిస్తామని స్పష్టంచేశారు. రైతుబంధు బీమా పథకంపై సోమవారం హైదరాబాద్ హెచ్‌ఐసీసీలో తెలంగాణ ప్రభుత్వం, ఎల్‌ఐసీ మధ్య ఎంవోయూ కుదిరింది. ముఖ్యమంత్రి కేసీఆర్, వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, రైతుసమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి సమక్షంలో వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి సీ పార్థసారథి, ఎల్‌ఐసీ చైర్మన్ వీకే శర్మ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసి, పత్రాలను మార్చుకున్నారు. అనంతరం రైతుబంధు జీవిత బీమా పథకంపై జిల్లా రైతు సమన్వయసమితి కో-ఆర్డినేటర్లు, జిల్లా వ్యవసాయాధికారులు, మండల రైతు సమన్వయ సమితి కో-ఆర్డినేటర్లు, మండల వ్యవసాయ విస్తరణాధికారులకు నిర్వహించిన అవగాహన సదస్సును ఉద్దేశించి సీఎం ప్రసంగించారు.

Latest News

 • రాష్ర్టాలకు స్వేచ్ఛనివ్వాలి

  రాష్ర్టాలకు స్వేచ్ఛనివ్వాలి

  -అభివృద్ధి సాధిస్తున్న రాష్ర్టాలను ప్రోత్సహించాలి -పన్నుల నుంచి మినహాయింపునివ్వాలి -లేదంటే అదనంగా నిధులను మంజూరుచేయాలి -కేంద్ర పథకాల నిబంధనలను సరళీకృతం చేయాలి -మరికొన్ని అంశాలను రాష్ర్టాలకు బదలాయించాలి -ఉపాధి హామీ పథక...

  Namasthe Telangana  On 18 Jun, 2018 11:28 AM Read More

 • ఢిల్లీ చేరుకున్న సీఎం కేసీఆర్

  ఢిల్లీ చేరుకున్న సీఎం కేసీఆర్

  -నేడు ప్రధాని మోదీతో సీఎం కేసీఆర్ భేటీ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు గురువారం మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీ విమానాశ్రయంలో ఆయనకు తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి రామచంద్రు తెజావత్, ఎంప...

  Namasthe Telangana  On 15 Jun, 2018 11:07 AM Read More

 • త్యాగానికి ప్రతీక రంజాన్

  త్యాగానికి ప్రతీక రంజాన్

  -ఉపవాస దీక్షలు సహనాన్ని పెంచుతాయి -రాజ్‌భవన్‌లో ఇఫ్తార్ విందులో గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ -పాల్గొన్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు రంజాన్ పండుగ మానవత్వానికి, త్యాగానికి ప్రతీక అని గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ పేర్కొన్న...

  Namasthe Telangana  On 11 Jun, 2018 1:16 PM Read More

 • రైతు బీమాకు ఎవరు అర్హులు

  రైతు బీమాకు ఎవరు అర్హులు

  రైతన్నలందరికీ న్యాయం చేయాలని తెలంగాణ ప్రభుత్వం రైతు బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రమాదవశాత్తు రైతు మరణిస్తే కుటుంబం వీధిన పడకుండా ఈ బీమా డబ్బులు సదరు కుటుంబానికి అందుతాయి. బీమా పరిహారం రూ.5లక్షలు ఉంటుంది. పట్టాదారు పా...

  Namasthe Telangana  On 6 Jun, 2018 12:22 PM Read More