రైతు బీమాకు ఎవరు అర్హులు

రైతన్నలందరికీ న్యాయం చేయాలని తెలంగాణ ప్రభుత్వం రైతు బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రమాదవశాత్తు రైతు మరణిస్తే కుటుంబం వీధిన పడకుండా ఈ బీమా డబ్బులు సదరు కుటుంబానికి అందుతాయి. బీమా పరిహారం రూ.5లక్షలు ఉంటుంది. పట్టాదారు పాసుబుక్కులు ఉన్న రైతులంతా ఈ పథకానికి అర్హులు. రైతులు 15 నుంచి 59 సంవత్సరాల లోపు వయస్సు వారై ఉండాలి. 15-08-2018 నుంచి 14-08-2019 వరకు అంటే ఏడాది ఈ బీమా అమలులో ఉంటుంది. ఏడాదికోసారి బీమా పథకాన్ని పునఃరుద్ధరిస్తారు. దరఖాస్తు చేయాలంటే.... ఆధార్‌కార్డులో ఉన్న పుట్టిన తేదీ ప్రకారం రైతుల వయస్సు లెక్కిస్తారు. ఒకవేళ పట్టిన తేదీ లేకపోతే జూలై 1ని పుట్టిన తేదీగా పరిగణలోకి తీసుకుంటారు. ప్రతీ పట్టాదారుడి ఆధార్ నంబర్, పాసుపుస్తకం నెంబరు, మొబైల్ నెంబరు, ఒకవేళ చనిపోతే డబ్బులు ఎవరికి చెల్లించాలో తెలిపే నామిని పేరు, నామిని ఆధార్, మొబైల్ నెంబర్ మొదలైన వివరాలతో పాటు రైతు స్వయంగా సంతకం చేయాల్సి ఉంటుంది. ఈ పథకంలో చేరిన ప్రతి ఒక్క పట్టాదారుడికి ఆగస్టు15 తర్వాత ఎల్‌ఐసీ బీమా సర్టిఫికెట్ జారీ చేస్తుంది. గురువారం నుంచి అధికారులు నామిని వివరాలతో పాటు అర్హులైన రైతుల వివరాలను అన్ని మండలాల్లో ఏఈవో క్లస్టర్‌ల వారీగా ఏఈవోలు రైతుల వద్ద సేకరించనున్నారు. పది రోజుల్లో పూర్తి... ఎల్‌ఐసీ, వ్యవసాయ శాఖ ముద్రతో కూడిన దరఖాస్తు ఫారాలు ఇప్పటికే అధికారులకు అందాయి. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం అధికారులకు దిశానిర్దేశం చేశారు. మరోవైపు దీనికి సంబంధించి రైతు సమన్వయ సమితి కో-ఆర్డినేటర్లు సైతం అధికారులకు సాయం అందించనున్నారు. ఈ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో వారం నుంచి పదిరోజుల వ్యవధిలో ఈ ప్రక్రియ పూర్తి చేయాలని జిల్లా వ్యవసాయ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యం చేయవద్దని, వర్షాలు పడితే రైతులు అందుబాటులో ఉండే అవకాశం లేదు కాబట్టి వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చెబుతున్నారు.

Latest News

  • దేశం గర్వించేలా తెలంగాణ తేజస్సు

    దేశం గర్వించేలా తెలంగాణ తేజస్సు

    - నాలుగేళ్లుగా ఆదాయవృద్ధిలో అగ్రస్థానం - ప్రధానే మెచ్చుకున్నారు - బంగారు తెలంగాణకు పునరంకితం - విజయయాత్రకు అండగా నిలవాలి - కుట్రలన్నీ తుత్తునియలు - సుస్థిరత, రాజకీయ అవినీతి లేని పాలన - కేంద్రం ఆమోదించగానే కొత్త జోనల్‌ ని...

     On 16 Aug, 2018 11:00 AM Read More

  • విభజన హామీలు అమలుచేయాలి

    విభజన హామీలు అమలుచేయాలి

    - కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వాలి - లేనిపక్షంలో 20వేల కోట్ల ప్యాకేజీ ఇవ్వాలి - తమిళనాడు తరహాలో తెలంగాణకు రిజర్వేషన్లు -బీసీల సంక్షేమానికి కేంద్రంలో ప్రత్యేక శాఖ - టీఆర్‌ఎస్ కార్యవర్గం తీర్మానాలు - మీడియాకు వివరించిన పార్ట...

    Namasthe Telangana  On 14 Aug, 2018 10:45 AM Read More

  • ఆగస్టు 15 మూడు కానుకలు

    ఆగస్టు 15 మూడు కానుకలు

    - రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ కొత్త పథకాలు - పేదలకు కంటి చూపు.. రైతులకు బీమా సౌకర్యం.. -బీసీలకు సబ్సిడీ రుణాలు - ప్రజలకు అందనున్న మిషన్ భగీరథ ఫలాలు - స్వచ్ఛ గ్రామాలకు ఆగస్టు 15 నుంచే శ్రీకారం స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్క...

    Namasthe Telangana  On 13 Aug, 2018 10:37 AM Read More

  • కరుణానిధికి సీఎం కేసీఆర్ నివాళి

    కరుణానిధికి సీఎం కేసీఆర్ నివాళి

    - కుటుంబ సభ్యులకు పరామర్శ - కేసీఆర్ వెంట ఎంపీ కవిత, విప్ పల్లా - ప్రజల సందర్శనార్థం రాజాజీ హాల్లో భౌతికకాయం - కరుణ కడపటి చూపు కోసం జనం బారులు - నివాళులర్పించిన ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ - వివిధ రాష్ర్టాల సీఎంలు, నేతలు, సినీ ప్ర...

    Namasthe Telangana  On 9 Aug, 2018 11:31 AM Read More

  • హరిత  సైన్యం

    హరిత సైన్యం

    - పచ్చదనం పెంపునకు పోలీసుశాఖ సాయంతో ఏర్పాటు - మొక్కల పెంపకంలో రాజీ లేదు - సిబ్బందితోపాటు నిధులు కేటాయిస్తాం - సమష్టి కృషితోనే హరిత లక్ష్యాల సాధన - హరితహారంలో సీఎం కేసీఆర్‌ ప్రకటన - ఒకేరోజు 1.25 లక్షల మొక్కలు నాటిన గజ్వేల్‌ ...

     On 2 Aug, 2018 6:14 PM Read More