కనకదుర్గమ్మకు ముక్కుపుడక సమర్పించిన సీఎం కేసీఆర్

విజయవాడ: తెలంగాణ రాష్ట్రం, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తాను మొక్కిన దేవుళ్లకు వరుసగా మొక్కులు చెల్లించుకుంటూ వస్తున్నారు సీఎం కేసీఆర్. ఇదివరకే తిరుపతి వెంకన్నకు కంఠహారం, సాలగ్రామహారం సమర్పించారు. కురవి వీరభద్రస్వామికి కోరమీసం మొక్కు చెల్లించారు. వరంగల్ భద్రకాళి అమ్మవారికి కిరీటం సమర్పించారు. ఇప్పుడు బెజవాడ కనకదుర్గమ్మకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా తయారు చేయించిన ముక్కు పుడకను సమర్పించారు. బంగారం, విలువైన రాళ్లు, రతనాలు పొదిగి ఉన్న దీన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. ఈ ముక్కు పుడక 11.29 గ్రాముల బరువు ఉంది. కుటుంబ సమేతంగా కనకదుర్గమ్మ సన్నిధికి చేరుకున్న ముఖ్యమంత్రికి దేవస్థానం మంగళ వాయిద్యాలు, పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికింది. అనంతరం దుర్గమ్మకు ముక్కు పుడకను సమర్పించి కుటుంబ సభ్యులతో సహా ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెంటనే అర్చకులు ముక్కుపుడకను అమ్మవారికి అలంకరించారు. దర్శనం అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి సీఎం చేరుకోనున్నారు.

Latest News

 • కేసీఆర్ ప్రజాయాత్ర

  కేసీఆర్ ప్రజాయాత్ర

  - అక్టోబర్ 3 నుంచి జిల్లాల్లో టీఆర్‌ఎస్ బహిరంగ సభలు - ఐదు ఉమ్మడి జిల్లాల్లో 8 వరకు ప్రచారం రాష్ట్రంలో త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలకు టీఆర్‌ఎస్ పార్టీ భారీఎత్తున ప్రచారానికి తెరలేపింది. ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున...

  Namasthe Telangana  On 26 Sep, 2018 11:07 AM Read More

 • కేసీఆర్‌ ప్రచార వ్యూహంపై నేడు నిర్ణయం!

  కేసీఆర్‌ ప్రచార వ్యూహంపై నేడు నిర్ణయం!

  - ముఖ్యనేతలతో భేటీ కానున్న సీఎం ఎన్నికల ప్రచారం కొనసాగింపు, సభల నిర్వహణ, ఇతర వ్యూహాలపై తెలంగాణ ముఖ్యమంత్రి, తెరాస అధినేత కేసీఆర్‌ సోమవారం నిర్ణయం తీసుకోనున్నారు. పార్టీ ముఖ్యనేతలతో ఆయన తన నివాసంలో సమావేశం కానున్నారు. ఈ నె...

   On 24 Sep, 2018 12:29 PM Read More

 • 70 రోజులు కీలకం

  70 రోజులు కీలకం

  - ప్రజలతో మమేకమే ముఖ్యం - ప్రతి గ్రామంలోనూ అభ్యర్థి ప్రచారం - భారీ విజయానికి టీఆర్‌ఎస్ వ్యూహం - అన్ని స్థాయిల్లో అప్రమత్తంగా ఉండాలి - ప్రజలను నేరుగా కలువడానికే ప్రాధాన్యం - టీఆర్‌ఎస్ శ్రేణులకు అధినాయకత్వం సందేశం తెలంగాణ ర...

  Namasthe Telangana  On 20 Sep, 2018 1:34 PM Read More

 • కంటివెలుగు @ 30 లక్షలు

  కంటివెలుగు @ 30 లక్షలు

  6,18,016 మందికి రీడింగ్ అద్దాల పంపిణీ 10 జిల్లాల్లో లక్షమందికి పైగా కంటిపరీక్షలు హైదరాబాద్ పరిధిలో 3 లక్షల మందికి పరీక్షలు తరువాతి స్థానాల్లో మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాలు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున...

  Namasthe Telangana  On 19 Sep, 2018 7:22 PM Read More

 • టీఆర్ఎస్‌కు ఎదురేలేదు

  టీఆర్ఎస్‌కు ఎదురేలేదు

  - వార్ వన్‌సైడే! - కేసీఆర్ పనితీరు సూపర్.. 67.26% ప్రజల అభిప్రాయం - వచ్చే ఎన్నికల్లో 90 సీట్లు ఖాయం - ఫ్లాష్ టీమ్ తాజా సర్వేలో వెల్లడి - దరిదాపుల్లోనూ లేని ప్రతిపక్షాలు - కేంద్రంలో బీజేపీకి గడ్డుకాలమేనన్న సర్వే - 35% ప్రజలే మళ్లీ మోదీ ...

  Namasthe Telangana  On 18 Sep, 2018 12:36 PM Read More