రాష్ట్ర ప్రగతి అద్భుతం

- సీఎం కేసీఆర్‌తో యూఏఈ మంత్రి షేక్ అబ్దుల్లా - రాష్ట్రంలో పెట్టుబడులకు సంసిద్ధత - హైదరాబాద్‌లో యూఏఈ కాన్సులేట్‌కు నిర్ణయం -స్థలం.. మౌలిక సదుపాయాల కల్పనకు సీఎం ఆదేశం ఆర్థిక, సామాజిక రంగాల్లో తెలంగాణ సాధిస్తున్న ప్రగతి అద్భుతంగా ఉందని.. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఆదర్శంగా ఉన్నాయని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయేద్ అల్ నహ్యాల్ ప్రశంసించారు. ఆయన గురువారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుతో సమావేశమయ్యారు. దాదాపు గంటపాటు కొనసాగిన ఈ భేటీలో.. నూతన రాష్ట్రమైన తెలంగాణలో సాగుతున్న పాలన, జరుగుతున్న అభివృద్ధి గురించి యూఏఈ మంత్రి ఆసక్తితో సీఎంను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణలో వివిధ రంగాలలో పెట్టుబడులు పెట్టడానికి యూఏఈ మంత్రి ఆసక్తి కనబరిచారు. హైదరాబాద్‌లో యూఏఈ కాన్సులేట్ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి చెప్పగా.. అందుకు కావాల్సిన స్థలం, మౌలిక సదుపాయాల కల్పనకు సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో ఆర్థికపరమైన అంశాలు, పరిశ్రమల స్థాపన గురించి మాత్రమే కాకుండా, తెలంగాణలో సామాజిక రంగం విద్య, వైద్యవ్యవస్థల తీరు గురించి ఎమిరేట్స్ మంత్రి ఆరాతీయంగా ముఖ్యమంత్రి వివరించారు. విద్యుత్, వ్యవసాయం, సాగునీటి ప్రాజెక్టులు, మైనార్టీల కోసం అమలుచేస్తున్న పథకాల గురించి తెలుసుకొని అభినందించారు. తాను త్వరలోనే తిరిగి వస్తానని, అప్పుడు మూడునాలుగు రోజులుండైనా కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శిస్తానని, అభివృద్ధి కార్యక్రమాలను కూడా చూస్తానని షేక్ అబ్దుల్లా సంతోషంగా చెప్పారు.

Latest News

 • ప్రజలు టీఆర్‌ఎస్‌ను మరోసారి ఆశీర్వదించారు: కేసీఆర్

  ప్రజలు టీఆర్‌ఎస్‌ను మరోసారి ఆశీర్వదించారు: కేసీఆర్

  హైదరాబాద్: ప్రజలు టీఆర్‌ఎస్ పార్టీని మరోసారి ఆశీర్వదించారని సీఎం కేసీఆర్ టీఆర్‌ఎస్ అభ్యర్థులతో అన్నారు. ఓట్ల లెక్కింపు సమయంలో అప్రమత్తంగా ఉండాలని టీఆర్‌ఎస్ అభ్యర్థులకు సీఎం కేసీఆర్ సూచించారు. నిన్న పలువురు పార్టీ అభ్యర...

  Namasthe Telangana  On 10 Dec, 2018 1:11 PM Read More

 • ఒక్కడిపై ఇంతమందా?

  ఒక్కడిపై ఇంతమందా?

  - నేను తెలంగాణ ఏజెంటును - ఎవరికో ఏజెంటుగా ఉండే గతి నాకు పట్టలేదు - నన్ను చూస్తే కాంగ్రెస్‌, భాజపాలకు వణుకు - ఇక్కడి వరకే నన్ను కట్టడి చేయాలని కుయుక్తులు - ప్రధాన మంత్రివి పచ్చి అబద్ధాలు - దేశంలో 40 వేల టీఎంసీలు వృథాగా పోతున్నా...

   On 4 Dec, 2018 12:13 PM Read More

 • నేను ప్రజల ఏజెంట్‌ని: కేసీఆర్‌

  నేను ప్రజల ఏజెంట్‌ని: కేసీఆర్‌

  కోదాడ: మన దేశంలో ప్రధానమంత్రి కూడా పచ్చి అబద్ధాలు చెబుతున్నారని సీఎం కేసీఆర్‌ ఆవేదన వ్యక్తంచేశారు. అది దేశ ప్రజల దురదృష్టమని వ్యాఖ్యానించారు. దేశంలో రాజకీయ పరిస్థితులు అలా వున్నాయని వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో పరిస్థి...

   On 3 Dec, 2018 4:41 PM Read More

 • రాష్ట్రమంతటా టీఆర్‌ఎస్‌కు పాజిటివ్ వేవ్

  రాష్ట్రమంతటా టీఆర్‌ఎస్‌కు పాజిటివ్ వేవ్

  - ఒకే రోజు 15 నియోజకవర్గాలు 9 సభలు - ముఖ్యమంత్రి కేసీఆర్ మరో రికార్డు - ప్రతి సభకూ ప్రభంజనంలా జనం - ఆలస్యమైనా కేసీఆర్ కోసం ఓపికగా ఎదురుచూపులు తెలంగాణ ఏర్పడితే అంధకారం అవుతుందని శాపాలు పెట్టారని, కానీ.. వారందరి అంచనాలను తలకింద...

  Namasthe Telangana  On 27 Nov, 2018 1:16 PM Read More

 • అమ్మా.. నీ కడుపు ఎందుకు తరుక్కుపోతోంది?

  అమ్మా.. నీ కడుపు ఎందుకు తరుక్కుపోతోంది?

  - నెల నెలా సూట్‌కేసులు అందడం లేదనా! - రైతులు, నేతన్నల ఆత్మహత్యలు తగ్గాయనా! - ఆనాడే తెలంగాణ ఇచ్చి ఉంటే కాంగ్రెస్‌కు గౌరవం దక్కేది - పన్ను రాయితీలపై హామీ ఇచ్చాకే రాహుల్‌ రాష్ట్రంలోకి అడుగుపెట్టాలి - చంద్రబాబు మాట వింటే కులీకు...

   On 26 Nov, 2018 11:19 AM Read More