రైతు పథకాలు ఆదర్శనీయం

-కర్ణాటకలోనూ అమలుపరుస్తాం -సీఎం కేసీఆర్‌తో భేటీలో మాజీ ప్రధాని దేవెగౌడ! -నీటి ప్రాజెక్టులు, వివిధ పథకాలపై ఆరా -గడువులోపే పూర్తిచేస్తుండటంపై ఆశ్చర్యం -భవిష్యత్‌లో ప్రాంతీయ పార్టీలదే బలమన్న మాజీ ప్రధాని రాష్ట్రంలో అమలుపరుస్తున్న రైతు పథకాలు ఆదర్శనీయంగా ఉన్నాయని, వీటిని కర్ణాటకలోనూ అమలుపరుస్తామని మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత దేవెగౌడ అన్నారు. రాష్ట్రంలో సాగునీటి, తాగునీటి ప్రాజెక్టులను చిత్తశుద్ధితో నిర్ణీత గడువు కంటే ముందే పూర్తిచేస్తుండటంపై ఆశ్చర్యం వ్యక్తంచేశారు. దేశంలో ప్రాంతీయపార్టీలు నానాటికీ ప్రజల ఆదరణను చూరగొంటున్నాయని, భవిష్యత్‌లో మరింతగా బలపడుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. రాజ్యసభ సభ్యుడు టీ సుబ్బరామిరెడ్డి మనుమరాలు వివాహానికి హాజరయ్యేందుకు వచ్చిన దేవెగౌడ ఆదివారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలు పెరిగే విధంగా తీసుకున్న చర్యలను ఆసక్తిగా అడిగి తెలుసుకున్నట్టు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం వినూత్నంగా అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై దేవెగౌడ ఆసక్తి ప్రదర్శించారు. ముఖ్యంగా వ్యవసాయానికి దన్నుగా నిలుస్తున్న రైతు పెట్టుబడి పథకం గురించి వివరాలు తెలుసుకున్నారు. రైతులకు ఎకరానికి రెండు పంటలకు కలిపి రూ.8 వేలు ఇస్తున్నామని, మొదటి పంట కింద రూ.4 వేలు ఇచ్చినట్టు సీఎం కేసీఆర్ తెలిపారు. దీంతో రైతులు ధీమాతో సాగు పనులు చేసుకుంటున్నారన్నారు. రైతుకు రూ.ఐదు లక్షల జీవితబీమా పథకాన్ని కల్పిస్తున్నామని వివరించారు. కోటి ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో చేపట్టిన ప్రాజెక్టుల గురించి.. ముఖ్యంగా గోదావరి నదిపై నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు గురించి దేవెగౌడ వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిర్ణీత సమయంలోగా ప్రాజెక్టు పూర్తవుతున్న తీరుపై ఆశ్చర్యం వ్యక్తంచేశారు. ఇంటింటికి సురక్షిత తాగునీటిని అందించే విధంగా చేపట్టి పూర్తిచేస్తున్న మిషన్ భగీరథ పథకం గురించి అడిగి తెలుసుకున్నారు. కర్ణాటకలో కూడా తె లంగాణ మాదిరిగా రైతు సంక్షేమ పథకాలను అమలుచేయాలని గౌడ అన్నట్టు సమాచారం.

Latest News

  • ప్రజలు టీఆర్‌ఎస్‌ను మరోసారి ఆశీర్వదించారు: కేసీఆర్

    ప్రజలు టీఆర్‌ఎస్‌ను మరోసారి ఆశీర్వదించారు: కేసీఆర్

    హైదరాబాద్: ప్రజలు టీఆర్‌ఎస్ పార్టీని మరోసారి ఆశీర్వదించారని సీఎం కేసీఆర్ టీఆర్‌ఎస్ అభ్యర్థులతో అన్నారు. ఓట్ల లెక్కింపు సమయంలో అప్రమత్తంగా ఉండాలని టీఆర్‌ఎస్ అభ్యర్థులకు సీఎం కేసీఆర్ సూచించారు. నిన్న పలువురు పార్టీ అభ్యర...

    Namasthe Telangana  On 10 Dec, 2018 1:11 PM Read More

  • ఒక్కడిపై ఇంతమందా?

    ఒక్కడిపై ఇంతమందా?

    - నేను తెలంగాణ ఏజెంటును - ఎవరికో ఏజెంటుగా ఉండే గతి నాకు పట్టలేదు - నన్ను చూస్తే కాంగ్రెస్‌, భాజపాలకు వణుకు - ఇక్కడి వరకే నన్ను కట్టడి చేయాలని కుయుక్తులు - ప్రధాన మంత్రివి పచ్చి అబద్ధాలు - దేశంలో 40 వేల టీఎంసీలు వృథాగా పోతున్నా...

     On 4 Dec, 2018 12:13 PM Read More

  • నేను ప్రజల ఏజెంట్‌ని: కేసీఆర్‌

    నేను ప్రజల ఏజెంట్‌ని: కేసీఆర్‌

    కోదాడ: మన దేశంలో ప్రధానమంత్రి కూడా పచ్చి అబద్ధాలు చెబుతున్నారని సీఎం కేసీఆర్‌ ఆవేదన వ్యక్తంచేశారు. అది దేశ ప్రజల దురదృష్టమని వ్యాఖ్యానించారు. దేశంలో రాజకీయ పరిస్థితులు అలా వున్నాయని వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో పరిస్థి...

     On 3 Dec, 2018 4:41 PM Read More

  • రాష్ట్రమంతటా టీఆర్‌ఎస్‌కు పాజిటివ్ వేవ్

    రాష్ట్రమంతటా టీఆర్‌ఎస్‌కు పాజిటివ్ వేవ్

    - ఒకే రోజు 15 నియోజకవర్గాలు 9 సభలు - ముఖ్యమంత్రి కేసీఆర్ మరో రికార్డు - ప్రతి సభకూ ప్రభంజనంలా జనం - ఆలస్యమైనా కేసీఆర్ కోసం ఓపికగా ఎదురుచూపులు తెలంగాణ ఏర్పడితే అంధకారం అవుతుందని శాపాలు పెట్టారని, కానీ.. వారందరి అంచనాలను తలకింద...

    Namasthe Telangana  On 27 Nov, 2018 1:16 PM Read More

  • అమ్మా.. నీ కడుపు ఎందుకు తరుక్కుపోతోంది?

    అమ్మా.. నీ కడుపు ఎందుకు తరుక్కుపోతోంది?

    - నెల నెలా సూట్‌కేసులు అందడం లేదనా! - రైతులు, నేతన్నల ఆత్మహత్యలు తగ్గాయనా! - ఆనాడే తెలంగాణ ఇచ్చి ఉంటే కాంగ్రెస్‌కు గౌరవం దక్కేది - పన్ను రాయితీలపై హామీ ఇచ్చాకే రాహుల్‌ రాష్ట్రంలోకి అడుగుపెట్టాలి - చంద్రబాబు మాట వింటే కులీకు...

     On 26 Nov, 2018 11:19 AM Read More