రిజర్వేషన్లపై సుప్రీంకు

-హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై అప్పీల్ -61% రిజర్వేషన్ అమలుకు వీలుగా పాత -ఉత్తర్వుల పునరుద్ధరణకు విజ్ఞప్తి.. - ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం -బీసీల రిజర్వేషన్లకు కాంగ్రెస్ గండికొట్టింది -బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇచ్చి తీరుతాం -తేల్చిచెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ -నేడు క్యాబినెట్ సబ్ కమిటీ భేటీకి ఆదేశం -పక్కాగా వాదనల ఖరారుకు సూచన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లు 50% దాటకూడదని హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టులో అప్పీల్ చేస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. పంచాయతీరాజ్ సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు ఇవ్వడంద్వారా తెలంగాణలో మొత్తం 61% రిజర్వేషన్లు అమలుచేసేలా గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన అనుమతి ఉత్తర్వులను పునరుద్ధరించాల్సిందిగా కోరాలని సీఎం నిర్ణయించారు. దీనికి అవసరమైన కసరత్తు చేసి, సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడానికి బుధవారం క్యాబినెట్ సబ్‌కమిటీ సమావేశం కావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అడ్వకేట్ జనరల్‌తోపాటు సంబంధిత అధికారులను కూడా ఈ సమావేశానికి పిలిచి, అన్ని విషయాలను కూలంకషంగా చర్చించాలని, పూర్వాపరాలను సమగ్రంగా పరిశీలించాలని సూచించారు. రాష్ట్రంలోని పంచాయతీరాజ్ సంస్థల్లో 61% రిజర్వేషన్లు అమలుచేయాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పే విధంగా వాదనలు ఖరారు చేయాలని సీఎం కోరారు. బీసీలకు 34% రిజర్వేషన్ ఇవ్వడాన్ని కాంగ్రెస్‌పార్టీ వ్యతిరేకిస్తూ, వారి తరఫున ఎన్నికైన సర్పంచ్ స్వప్నారెడ్డి ద్వారా హైకోర్టులో పిటిషన్ వేయించి బీసీల రిజర్వేషన్లకు గండి కొట్టిందని విమర్శించారు. బీసీలకు 34% రిజర్వేషన్లు ఇవ్వడానికి రాష్ట్రప్రభుత్వం పూర్తిస్థాయిలో కట్టుబడి ఉందని, ఇందుకు అవసరమైన న్యాయపోరాటం చేస్తామని సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రి జూపల్లి కృష్ణారావు అధ్యక్షతన మంత్రుల కమిటీ బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు సమావేశం కానున్నది. పంచాయతీరాజ్ రిజర్వేషన్ల అంశంపై అదనపు అడ్వకేట్ జనరల్, అధికారులతో మంత్రులు చర్చించనున్నారు.

Latest News

 • తెరాస తటస్థ వ్యూహం!

  తెరాస తటస్థ వ్యూహం!

  - భాజపా, కాంగ్రెస్‌, తెదేపాలకు దూరం - విభజన హామీలపై కేంద్రాన్ని నిలదీయాలి ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే.. తెలంగాణకూ ఇవ్వాల్సిందేనని పట్టుబట్టాలి - తెరాస ఎంపీలకు సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశం తెలంగాణ ప్రయోజనాల గురించి, విభజన హామ...

   On 20 Jul, 2018 11:05 AM Read More

 • పంచాయతీరాజ్ రిజర్వేషన్లపై సుప్రీంకు రాష్ట్ర ప్రభుత్వం

  పంచాయతీరాజ్ రిజర్వేషన్లపై సుప్రీంకు రాష్ట్ర ప్రభుత్వం

  పంచాయతీరాజ్ సంస్థల్లో ప్రజాప్రతినిధుల ఎన్నికలకు కేటాయించే రిజర్వేషన్ 50 శాతం దాటొద్దని హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వం తరుపున సుప్రీంకోర్టులో అప్పీల్ చేయనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. పంచాయ...

  Namasthe Telangana  On 10 Jul, 2018 7:58 PM Read More

 • రైతు పథకాలు ఆదర్శనీయం

  రైతు పథకాలు ఆదర్శనీయం

  -కర్ణాటకలోనూ అమలుపరుస్తాం -సీఎం కేసీఆర్‌తో భేటీలో మాజీ ప్రధాని దేవెగౌడ! -నీటి ప్రాజెక్టులు, వివిధ పథకాలపై ఆరా -గడువులోపే పూర్తిచేస్తుండటంపై ఆశ్చర్యం -భవిష్యత్‌లో ప్రాంతీయ పార్టీలదే బలమన్న మాజీ ప్రధాని రాష్ట్రంలో అమలుప...

  Namasthe Telangana  On 2 Jul, 2018 10:39 AM Read More

 • రాష్ట్ర ప్రగతి అద్భుతం

  రాష్ట్ర ప్రగతి అద్భుతం

  - సీఎం కేసీఆర్‌తో యూఏఈ మంత్రి షేక్ అబ్దుల్లా - రాష్ట్రంలో పెట్టుబడులకు సంసిద్ధత - హైదరాబాద్‌లో యూఏఈ కాన్సులేట్‌కు నిర్ణయం -స్థలం.. మౌలిక సదుపాయాల కల్పనకు సీఎం ఆదేశం ఆర్థిక, సామాజిక రంగాల్లో తెలంగాణ సాధిస్తున్న ప్రగతి అద్భ...

  Namasthe Telangana  On 29 Jun, 2018 10:48 AM Read More