పంచాయతీలకు స్పెషల్ ఆఫీసర్లే

-సర్పంచ్‌ల కొనసాగింపు చట్టరీత్యా అసాధ్యం -ప్రభుత్వానికి స్పష్టంచేసిన సీనియర్ అధికారులు -ఇవీ అధికారుల సూచనలు -మున్సిపాలిటీలుగా మారిన, మున్సిపాలిటీలలో కలిసిన గ్రామాలు 300 వరకు ఉన్నాయి. -వాటికి సర్పంచ్‌లు పర్సన్ ఇంచార్జీలుగా వ్యవహరించడం ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదు. -గ్రామ పంచాయతీల్లో యథాతథంగా ఉన్నవి ఐదుశాతంలోపు మాత్రమే -కాబట్టి ఇప్పుడున్న సర్పంచ్‌లను పర్సన్ ఇంచార్జీలుగా నియమించడం అసంబద్ధం. -చట్టం అమలుచేయకుంటే న్యాయపరమైన చిక్కులు కూడా వస్తాయి. రాష్ట్రంలో గ్రామపంచాయతీ సర్పంచ్‌ల పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో వారి స్థానంలో అధికారులనే స్పెషల్ ఆఫీసర్లుగా నియమించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి నేతృత్వంలోని సీనియర్ అధికారులు సూచించారు. ఇంతకుమించి మరో మార్గంలేదని స్పష్టంచేశారు. ప్రస్తుతం ఉన్న సర్పంచ్‌లను పర్సన్ ఇంచార్జీలుగా నియమించడం చట్టప్రకారం సాధ్యంకాదని, న్యాయస్థానాలు కూడా అంగీకరించబోవని వారు తేల్చిచెప్పారు. ఆగస్టు 1వ తేదీతో సర్పంచ్‌ల పదవీకాలం ముగుస్తున్న నేపథ్యంలో గ్రామ పంచాయతీల పాలనపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న సర్పంచ్‌లనే పర్సన్ ఇంచార్జీలుగా నియమించాలనే డిమాండ్లు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మంగళవారం ప్రగతిభవన్‌లో దాదాపు ఎనిమిది గంటలపాటు సుదీర్ఘంగా సమీక్షించారు. పంచాయతీల బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై మంత్రులు, అధికారులు, ప్రజాప్రతినిధులతో విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా స్పెషల్ ఆఫీసర్ల నియామకానికి చేస్తున్న కసరత్తును సీఎం కేసీఆర్‌కు అధికారులు తెలిపారు.

Latest News

 • దేశం గర్వించేలా తెలంగాణ తేజస్సు

  దేశం గర్వించేలా తెలంగాణ తేజస్సు

  - నాలుగేళ్లుగా ఆదాయవృద్ధిలో అగ్రస్థానం - ప్రధానే మెచ్చుకున్నారు - బంగారు తెలంగాణకు పునరంకితం - విజయయాత్రకు అండగా నిలవాలి - కుట్రలన్నీ తుత్తునియలు - సుస్థిరత, రాజకీయ అవినీతి లేని పాలన - కేంద్రం ఆమోదించగానే కొత్త జోనల్‌ ని...

   On 16 Aug, 2018 11:00 AM Read More

 • విభజన హామీలు అమలుచేయాలి

  విభజన హామీలు అమలుచేయాలి

  - కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వాలి - లేనిపక్షంలో 20వేల కోట్ల ప్యాకేజీ ఇవ్వాలి - తమిళనాడు తరహాలో తెలంగాణకు రిజర్వేషన్లు -బీసీల సంక్షేమానికి కేంద్రంలో ప్రత్యేక శాఖ - టీఆర్‌ఎస్ కార్యవర్గం తీర్మానాలు - మీడియాకు వివరించిన పార్ట...

  Namasthe Telangana  On 14 Aug, 2018 10:45 AM Read More

 • ఆగస్టు 15 మూడు కానుకలు

  ఆగస్టు 15 మూడు కానుకలు

  - రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ కొత్త పథకాలు - పేదలకు కంటి చూపు.. రైతులకు బీమా సౌకర్యం.. -బీసీలకు సబ్సిడీ రుణాలు - ప్రజలకు అందనున్న మిషన్ భగీరథ ఫలాలు - స్వచ్ఛ గ్రామాలకు ఆగస్టు 15 నుంచే శ్రీకారం స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్క...

  Namasthe Telangana  On 13 Aug, 2018 10:37 AM Read More

 • కరుణానిధికి సీఎం కేసీఆర్ నివాళి

  కరుణానిధికి సీఎం కేసీఆర్ నివాళి

  - కుటుంబ సభ్యులకు పరామర్శ - కేసీఆర్ వెంట ఎంపీ కవిత, విప్ పల్లా - ప్రజల సందర్శనార్థం రాజాజీ హాల్లో భౌతికకాయం - కరుణ కడపటి చూపు కోసం జనం బారులు - నివాళులర్పించిన ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ - వివిధ రాష్ర్టాల సీఎంలు, నేతలు, సినీ ప్ర...

  Namasthe Telangana  On 9 Aug, 2018 11:31 AM Read More

 • హరిత సైన్యం

  హరిత సైన్యం

  - పచ్చదనం పెంపునకు పోలీసుశాఖ సాయంతో ఏర్పాటు - మొక్కల పెంపకంలో రాజీ లేదు - సిబ్బందితోపాటు నిధులు కేటాయిస్తాం - సమష్టి కృషితోనే హరిత లక్ష్యాల సాధన - హరితహారంలో సీఎం కేసీఆర్‌ ప్రకటన - ఒకేరోజు 1.25 లక్షల మొక్కలు నాటిన గజ్వేల్‌ ...

   On 2 Aug, 2018 6:14 PM Read More