ఒక్కరోజులో 1,00,116 మొక్కలు

- 1న గజ్వేల్‌లో హరితహారం - పాల్గొననున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ - చెట్ల నిష్పత్తిలో ఇతర దేశాల కన్నా వెనుకబడ్డాం - అటవీ ప్రాంతాల్లో అడవిని పునరుద్ధరించాలి - మొక్కలను బాగా సంరక్షించిన వారికి అవార్డులివ్వాలి - సమీక్ష సమావేశంలో అధికారులకు సీఎం ఆదేశాలు రాష్ట్రంలో పచ్చదనం పెంపొందించటమే లక్ష్యంగా నిర్వహిస్తున్న హరితహారం కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈసారి గజ్వేల్‌లో పాల్గొననున్నారు. ఆగస్టు 1న గజ్వేల్‌ పట్టణంలో ఒక్క రోజులోనే లక్షా116 మొక్కలు నాటాలని నిర్ణయించారు. వీటితో పాటుగా అటవీభూముల్లో మరో 20 వేల మొక్కలు నాటాలని సీఎం అధికారుల్ని ఆదేశించారు. నాలుగో విడత హరితహారంపై మంత్రులు, అధికారులతో ప్రగతిభవన్‌లో బుధవారం సమీక్షించారు. ‘‘గజ్వేల్‌ పట్టణంలో ఆగస్టు 1న ఒకేసారి లక్ష 116 మొక్కలు నాటాలి. ప్రజాప్రతినిధులు, అధికారులు, పోలీసులు, విద్యార్థులు, మహిళలు, యువకులు, స్వయంసహాయక బృందాల సభ్యులు, వ్యాపారులు.. అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. అన్నిరకాల రహదారుల వెంట, ప్రభుత్వ-ప్రైవేటు సంస్థల ఆవరణలో..గుడి,మసీదు, చర్చి వంటి ప్రార్థనా మందిరాల్లో, ప్రతి ఇంట్లో మొక్కలు నాటాలి. ఒకరోజు ముందే మొక్కలను ఇళ్లకు చేర్చాలి. ఇంట్లో ఎంతమంది సభ్యులుంటే అన్ని మొక్కలు నాటేలా ఏర్పాట్లు చేయాలి. పండ్లు, పూలచెట్లు కచ్చితంగా ఉండాలి’’ అని అధికారుల్ని ఆదేశించారు. మొక్కల పెంచడంలో బాగా శ్రద్ధ చూపిన వారికి అవార్డులు అందించాలని సూచించారు. ‘‘ఆగస్టు 1న అనుకున్న సమయానికి గజ్వేల్‌ పట్టణంలోని అన్ని మసీదుల్లో సైరన్‌ మోగాలి. ఆ వెంటనే ముఖ్యమంత్రితో సహా, అంతా ఒకేసారి ఎక్కడకక్కడ మొక్కలు నాటాలి. నాటిన మొక్కల్ని బతికించడానికి ట్రీగార్డులు పెట్టాలి. పట్టణంలో పిచ్చి మొక్కల్ని తొలగించి మంచి మొక్కలు నాటాలి’’ అని సీఎం వివరించారు.

Latest News

  • నేడు టీఆర్‌ఎస్ పాక్షిక మ్యానిఫెస్టో

    నేడు టీఆర్‌ఎస్ పాక్షిక మ్యానిఫెస్టో

    - చిన్న ఉద్యోగుల వేతనాల పెంపు.. - ఆసరా పింఛన్ల పెంపుదల.. - ఇంటిస్థలం ఉన్నవారికీ డబుల్ బెడ్‌రూం ఇండ్లు - నిరుద్యోగులకు భృతి ఇచ్చే యోచన - హామీలపై ఇప్పటికే కేసీఆర్ సంకేతాలు - స్వయంగా వెల్లడించనున్న పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ - కమి...

    Namasthe Telangana  On 16 Oct, 2018 10:24 AM Read More

  • కేసీఆర్ ధూం ధాం

    కేసీఆర్ ధూం ధాం

    -50రోజుల ప్రచార ప్రణాళిక సిద్ధం -జిల్లాస్థాయి సభలు కాకుండా నియోజకవర్గాల్లోనే సభలు -పాటల సీడీలను సిద్ధంచేస్తున్న దేశపతి బృందం -అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే ప్రధానాంశాలు -దశలవారీగా 14 మంది అభ్యర్థుల ప్రకటన -నియోజకవర్గాల...

    Namasthe Telangana  On 8 Oct, 2018 12:51 PM Read More

  • మహాకూటమికాదు..కాలకూట విషం

    మహాకూటమికాదు..కాలకూట విషం

    - ప్రతిపక్షాల కుట్రలను తెలంగాణ సమాజం తిప్పికొట్టాలె - మోసపోతె గోసపడుతం - తెలంగాణ మళ్లీ ఆగం కావొద్దు - ప్రగతిరథ చక్రాలు ఆగొద్దు - తెలంగాణకు చారిత్రక ద్రోహం చేసిన కాంగ్రెస్ - కాంగ్రెస్ నాయకులు రాష్ట్రానికి శాపం - తెలంగాణ బతు...

    Namasthe Telangana  On 5 Oct, 2018 10:33 AM Read More

  • అంధత్వరహిత తెలంగాణ

    అంధత్వరహిత తెలంగాణ

    -కంటివెలుగులో అట్టడుగువర్గాలకు అధిక సంఖ్యలో పరీక్షలు -తరలివస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు -నెరవేరుతున్న ప్రభుత్వ సంకల్పం -29 రోజుల్లో 42.27 లక్షల మందికి కంటి పరీక్షలు రాష్ర్టాన్ని అంధత్వరహిత తెలంగాణగా మార్చాలన్న ప్ర...

    Namasthe Telangana  On 1 Oct, 2018 11:06 AM Read More

  • వాజపేయి విలక్షణమైన నేత : సీఎం కేసీఆర్

    వాజపేయి విలక్షణమైన నేత : సీఎం కేసీఆర్

    దేశ ప్రధానుల్లో మాజీ ప్రధాని వాజపేయి విలక్షణమైన నేత అని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. ఇవాళ శాసనమండలిలో వాజపేయి సంతాప తీర్మానాన్ని సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... ముక్కుసూటిగా, నిష్కర్షంగా ...

     On 27 Sep, 2018 11:52 AM Read More