బోనమెత్తిన లష్కర్

-కన్నుల పండువగా మొదలైన శ్రీఉజ్జయినీ మహంకాళి అమ్మవారి జాతర -మూడు కిలోల బంగారు బోనమెత్తిన ఎంపీ కల్వకుంట్ల కవిత -అమ్మవారికి పట్టువస్ర్తాలు, బంగారు బోనం సమర్పించిన సీఎం కేసీఆర్ దంపతులు -మహంకాళీ.. జగజ్జననీ -లష్కర్ బోనాల జాతర.. -లక్షల మంది భక్తులతో జనసంద్రమైన జనరల్‌బజార్ -బంగారు బోనమెత్తిన ఎంపీ కవిత.. -అమ్మవారికి సమర్పించిన సీఎం కేసీఆర్ దంపతులు -తెలంగాణ సంస్కృతిని చాటిన కళా ప్రదర్శనలు.. నేడు రంగం లష్కర్ బోనమెత్తింది. శ్రీ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల జాతర ఆదివారం ప్రారంభమైంది. అమ్మవారి సాక్షిగా స్వచ్ఛమైన తెలంగాణ సంస్కృతి మరోసారి ఆవిష్కృతమైంది. అమ్మను దర్శించుకునేందుకు వచ్చిన లక్షల మంది భక్తులతో సికింద్రాబాద్ వీధులన్నీ కిక్కిరిసిపోయాయి. జనరల్‌బజార్ జనసంద్రంగా మారింది. వేల మంది తెలంగాణ ఆడబిడ్డలు నెత్తిన బోనమెత్తుకొని.. డప్పు చప్పుళ్లు, శివసత్తుల పూనకాల మధ్య ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి సమర్పించారు. మూడుకిలోల బంగారంతో తయారై.. వజ్రాలతో వన్నెలద్దుకున్న బంగారు బోనం జాతరకు మరింత శోభను తీసుకొచ్చింది. ఎంపీ కల్వకుంట్ల కవిత బంగారు బోనాన్ని ఎత్తుకొని ఊరేగింపుగా ఆలయానికి రాగా.. 1,016 మంది బోనమెత్తుకున్న మహిళలు అనుసరించారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సతీసమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రముఖుల రాక, తెలంగాణ కళా ప్రదర్శనలు జాతరకు మరిన్ని వెలుగులనద్దాయి. ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడంతో జాతర కన్నులపండువగా కొనసాగుతున్నది.

Latest News

 • నేడు టీఆర్‌ఎస్ పాక్షిక మ్యానిఫెస్టో

  నేడు టీఆర్‌ఎస్ పాక్షిక మ్యానిఫెస్టో

  - చిన్న ఉద్యోగుల వేతనాల పెంపు.. - ఆసరా పింఛన్ల పెంపుదల.. - ఇంటిస్థలం ఉన్నవారికీ డబుల్ బెడ్‌రూం ఇండ్లు - నిరుద్యోగులకు భృతి ఇచ్చే యోచన - హామీలపై ఇప్పటికే కేసీఆర్ సంకేతాలు - స్వయంగా వెల్లడించనున్న పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ - కమి...

  Namasthe Telangana  On 16 Oct, 2018 10:24 AM Read More

 • కేసీఆర్ ధూం ధాం

  కేసీఆర్ ధూం ధాం

  -50రోజుల ప్రచార ప్రణాళిక సిద్ధం -జిల్లాస్థాయి సభలు కాకుండా నియోజకవర్గాల్లోనే సభలు -పాటల సీడీలను సిద్ధంచేస్తున్న దేశపతి బృందం -అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే ప్రధానాంశాలు -దశలవారీగా 14 మంది అభ్యర్థుల ప్రకటన -నియోజకవర్గాల...

  Namasthe Telangana  On 8 Oct, 2018 12:51 PM Read More

 • మహాకూటమికాదు..కాలకూట విషం

  మహాకూటమికాదు..కాలకూట విషం

  - ప్రతిపక్షాల కుట్రలను తెలంగాణ సమాజం తిప్పికొట్టాలె - మోసపోతె గోసపడుతం - తెలంగాణ మళ్లీ ఆగం కావొద్దు - ప్రగతిరథ చక్రాలు ఆగొద్దు - తెలంగాణకు చారిత్రక ద్రోహం చేసిన కాంగ్రెస్ - కాంగ్రెస్ నాయకులు రాష్ట్రానికి శాపం - తెలంగాణ బతు...

  Namasthe Telangana  On 5 Oct, 2018 10:33 AM Read More

 • అంధత్వరహిత తెలంగాణ

  అంధత్వరహిత తెలంగాణ

  -కంటివెలుగులో అట్టడుగువర్గాలకు అధిక సంఖ్యలో పరీక్షలు -తరలివస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు -నెరవేరుతున్న ప్రభుత్వ సంకల్పం -29 రోజుల్లో 42.27 లక్షల మందికి కంటి పరీక్షలు రాష్ర్టాన్ని అంధత్వరహిత తెలంగాణగా మార్చాలన్న ప్ర...

  Namasthe Telangana  On 1 Oct, 2018 11:06 AM Read More

 • వాజపేయి విలక్షణమైన నేత : సీఎం కేసీఆర్

  వాజపేయి విలక్షణమైన నేత : సీఎం కేసీఆర్

  దేశ ప్రధానుల్లో మాజీ ప్రధాని వాజపేయి విలక్షణమైన నేత అని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. ఇవాళ శాసనమండలిలో వాజపేయి సంతాప తీర్మానాన్ని సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... ముక్కుసూటిగా, నిష్కర్షంగా ...

   On 27 Sep, 2018 11:52 AM Read More