కరుణానిధికి సీఎం కేసీఆర్ నివాళి

- కుటుంబ సభ్యులకు పరామర్శ - కేసీఆర్ వెంట ఎంపీ కవిత, విప్ పల్లా - ప్రజల సందర్శనార్థం రాజాజీ హాల్లో భౌతికకాయం - కరుణ కడపటి చూపు కోసం జనం బారులు - నివాళులర్పించిన ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ - వివిధ రాష్ర్టాల సీఎంలు, నేతలు, సినీ ప్రముఖులు - ఉద్వేగభరిత వాతావరణంలో స్వల్ప తొక్కిసలాట - ఇద్దరు అభిమానుల దుర్మరణం.. పలువురికి గాయాలు - సమాధి స్థలంపై ఉదయం వరకు సస్పెన్స్ - న్యాయపరమైన ఆటంకాల్లేవన్న మద్రాస్ హైకోర్టు - మెరీనా బీచ్‌లో అంత్యక్రియలకు వ్యతిరేకంగా - గతంలో దాఖలైన పిటిషన్ల ఉపసంహరణ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధికి తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఘన నివాళులర్పించారు. బుధవారం మధ్యాహ్నం బేగంపేట ఎయిర్‌పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో సీఎం కేసీఆర్ చెన్నై వెళ్లారు. ఆయన వెంట నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత, ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఉన్నారు. చన్నై చేరుకున్న ఆయన రాజాజీ హాల్‌లో కరుణానిధి పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అక్కడికి వచ్చిన కరుణానిధి అభిమానులు, డీఎంకే కార్యకర్తలకు విప్లవానికి సూచికగా పిడికిలి ఎత్తి చేయి చూపించారు. అనంతరం కరుణానిధి కుటుంబసభ్యులను కేసీఆర్, కవిత, పల్లా రాజేశ్వర్‌రెడ్డి పరామర్శించారు. మహానాయకుడిని కోల్పోవడం తమిళనాడుకు, దేశానికి ఎంతో లోటని, బాధాకరమని కరుణానిధి కుమారుడు స్టాలిన్‌తో కేసీఆర్ అన్నారు. ధైర్యం కోల్పోకుండా ఉండాలని, తమంతా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కరుణానిధి లాంటి మహానాయకుడి అంత్యక్రియలను ప్రభుత్వమే మెరీనా బీచ్‌లో అనుమతించి నిర్వహించాల్సిందని, కోర్టుకు పోయి అనుమతి తీసుకొనివచ్చేలా వ్యవహరించడం ప్రజలను ఆవేదనకు గురిచేసిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కరుణానిధితో తన గత స్మృతులను సీఎం కేసీఆర్ గుర్తుచేసుకున్నారు. కరుణానిధి కూతురు, ఎంపీ కనిమొళిని ఎంపీ కవిత పరామర్శించారు.

Latest News

 • నేడు టీఆర్‌ఎస్ పాక్షిక మ్యానిఫెస్టో

  నేడు టీఆర్‌ఎస్ పాక్షిక మ్యానిఫెస్టో

  - చిన్న ఉద్యోగుల వేతనాల పెంపు.. - ఆసరా పింఛన్ల పెంపుదల.. - ఇంటిస్థలం ఉన్నవారికీ డబుల్ బెడ్‌రూం ఇండ్లు - నిరుద్యోగులకు భృతి ఇచ్చే యోచన - హామీలపై ఇప్పటికే కేసీఆర్ సంకేతాలు - స్వయంగా వెల్లడించనున్న పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ - కమి...

  Namasthe Telangana  On 16 Oct, 2018 10:24 AM Read More

 • కేసీఆర్ ధూం ధాం

  కేసీఆర్ ధూం ధాం

  -50రోజుల ప్రచార ప్రణాళిక సిద్ధం -జిల్లాస్థాయి సభలు కాకుండా నియోజకవర్గాల్లోనే సభలు -పాటల సీడీలను సిద్ధంచేస్తున్న దేశపతి బృందం -అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే ప్రధానాంశాలు -దశలవారీగా 14 మంది అభ్యర్థుల ప్రకటన -నియోజకవర్గాల...

  Namasthe Telangana  On 8 Oct, 2018 12:51 PM Read More

 • మహాకూటమికాదు..కాలకూట విషం

  మహాకూటమికాదు..కాలకూట విషం

  - ప్రతిపక్షాల కుట్రలను తెలంగాణ సమాజం తిప్పికొట్టాలె - మోసపోతె గోసపడుతం - తెలంగాణ మళ్లీ ఆగం కావొద్దు - ప్రగతిరథ చక్రాలు ఆగొద్దు - తెలంగాణకు చారిత్రక ద్రోహం చేసిన కాంగ్రెస్ - కాంగ్రెస్ నాయకులు రాష్ట్రానికి శాపం - తెలంగాణ బతు...

  Namasthe Telangana  On 5 Oct, 2018 10:33 AM Read More

 • అంధత్వరహిత తెలంగాణ

  అంధత్వరహిత తెలంగాణ

  -కంటివెలుగులో అట్టడుగువర్గాలకు అధిక సంఖ్యలో పరీక్షలు -తరలివస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు -నెరవేరుతున్న ప్రభుత్వ సంకల్పం -29 రోజుల్లో 42.27 లక్షల మందికి కంటి పరీక్షలు రాష్ర్టాన్ని అంధత్వరహిత తెలంగాణగా మార్చాలన్న ప్ర...

  Namasthe Telangana  On 1 Oct, 2018 11:06 AM Read More

 • వాజపేయి విలక్షణమైన నేత : సీఎం కేసీఆర్

  వాజపేయి విలక్షణమైన నేత : సీఎం కేసీఆర్

  దేశ ప్రధానుల్లో మాజీ ప్రధాని వాజపేయి విలక్షణమైన నేత అని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. ఇవాళ శాసనమండలిలో వాజపేయి సంతాప తీర్మానాన్ని సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... ముక్కుసూటిగా, నిష్కర్షంగా ...

   On 27 Sep, 2018 11:52 AM Read More